Oct 04, 2026, 11:10 IST/
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయను: అక్బరుద్దీన్ ఒవైసీ
Oct 04, 2026, 11:10 IST
TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, తన శేష జీవితాన్ని మక్కాలో గడుపుతానని ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. బండ్లగూడలోని ఓ విద్యాసంస్థ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తనకు 55 ఏళ్లు వచ్చాయని, ముసలివాడినయ్యానని పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా, తన కుమారుడిని (4వ తరం) రాజకీయ వారసుడిగా రంగంలోకి దించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.