
మండలంలో యధావిధిగా పని చేస్తున్న బ్యాంకులు
సెప్టెంబర్ 28 నుండి 30 వరకు దేశవ్యాప్తంగా జరగనున్న బ్యాంకు సమ్మె నేపథ్యంలో, కర్నూలు, పాణ్యం మండల పరిధిలోని ఎస్బీఐ, ఏపీ గ్రామీణ బ్యాంకులు ఆదివారం కూడా యధావిధిగా పని చేశాయి. బ్యాంకు మేనేజర్లు మాట్లాడుతూ, అవసరమైన బ్యాంకింగ్ సేవలను ముందుగా ప్రణాళిక చేసుకోవాలని సూచించారు. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, యూపీఐ, బీసీ పాయింట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. కస్టమర్ల అసౌకర్యాన్ని నివారించడానికి ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు.






















