
విద్య కమిటీ చైర్మన్ ఎంపిక
స్థానిక పత్తికొండ రాజీవ్ నగర్ పాఠశాలలో నిర్వహించిన పాఠశాల తల్లిదండ్రుల ఎన్నికల కమిటీ చైర్మన్ గా అగస్త్య వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ గా కొండపల్లి జయశ్రీ ఎన్నికయ్యారు. పాఠశాల విద్యాభివృద్ధికి, బాలిక విద్యాభివృద్ధికి, గుణాత్మ విద్యను పెంపొందించడానికి, డ్రాప్ అవుట్లు తగ్గించడానికి, నా వంతు శాయశక్తుల కృషి చేస్తామని వారు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ నీలకంఠ, ఉపాధ్యాయ బృందం, కాలనీ పెద్దలు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.






























