Sep 07, 2026, 03:09 IST/
ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితం.. NHAI ప్రత్యేక ఆఫర్!
Sep 07, 2026, 03:09 IST
నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ప్రయాణికులకు శుభవార్త అందించింది. అపరిశుభ్రంగా ఉన్న హైవే టాయిలెట్ల ఫొటోలను రాజ్ మార్గ్ యాత్ర యాప్లో అప్లోడ్ చేస్తే, రూ. వెయ్యి ఫాస్టాగ్ రీఛార్జ్ ఉచితంగా పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ ప్రత్యేక క్యాంపెయిన్ను వచ్చే ఏడాది జూన్ 30 వరకు పొడిగించారు. ఇప్పటివరకు 429 మంది ఈ ఆఫర్ను పొందారు. ఒక వాహన రిజిస్ట్రేషన్ నంబర్పై ఒక్కసారి మాత్రమే ఈ రీఛార్జ్ పొందవచ్చు. ఈ పథకం NHAI నేరుగా నిర్వహిస్తున్న టాయిలెట్లకు మాత్రమే వర్తిస్తుంది.