
ఈర్ణపాడులో దంపతుల ఆత్మహత్య.. కారణాలు అంతుచిక్కని మిస్టరీ
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామంలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. గోపాల్ (58), అతని భార్య రమణమ్మ (53) అనే దంపతులు తమ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుడు గోపాల్ కుమారుడు ఆర్మీలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని, ఆత్మహత్యకు గల కారణాలు అధికారికంగా తెలియాల్సి ఉందని ఎస్సై జగన్మోహన్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






























