Oct 04, 2026, 16:10 IST/
తెలంగాణలో వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం!
Oct 04, 2026, 16:10 IST
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వయోవృద్ధులకు కూడా విస్తరించాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 'మహాలక్ష్మి' పథకం కింద మహిళలకు ఈ సౌకర్యం కల్పించింది. సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత బస్సు పాస్లు జారీ చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే మహిళలతో పాటు పురుషుల్లోని వయోవృద్ధులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది.