Sep 30, 2026, 13:09 IST/
UPI పేమెంట్స్ బంద్పై వెనక్కి తగ్గిన వ్యాపార సంఘాలు
Sep 30, 2026, 13:09 IST
యూపీఐపై MDR విధించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా 'నో యూపీఐ డే' పాటించనున్నట్లు ప్రకటించిన వ్యాపారులు, వ్యాపార సంఘాలు తమ నిరసనను విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. జీరో ఛార్జీల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని, మర్చంట్ టు మర్చంట్ లావాదేవీలను ఎండీఆర్ నుంచి మినహాయించాలని వ్యాపారులు కోరగా, కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.