ఆలూరు - Alur

వేదవతి ప్రాజెక్ట్ పనులు తక్షణమే ప్రారంభించాలి..సిపిఐ

వేదవతి ప్రాజెక్ట్ పనులు తక్షణమే ప్రారంభించాలి..సిపిఐ

ఆలూరులో సీపీఐ మండల సమితి సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గిడ్డయ్య మాట్లాడుతూ వేదవతి ప్రాజెక్టు పనులు తక్షణమే ప్రారంభించాలని, భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీపీఐ ఆలూరు మండల కార్యదర్శి ఎస్. ఎస్. భాష, సీపీఐ ఆలూరు తాలూకా ఇన్‌చార్జి మద్దిలేటి శెట్టి, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కె. భూపేష్, చంద్రకాంత్ రెడ్డి, శివ సిద్ధి, లింగ మహేష్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా
ప్రియుడితో కలిసి మామిడి తోటలో ప్రేయసి సూసైడ్
Oct 11, 2026, 15:10 IST/

ప్రియుడితో కలిసి మామిడి తోటలో ప్రేయసి సూసైడ్

Oct 11, 2026, 15:10 IST
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా ధమ్నిఖేడా గ్రామంలోని మామిడి తోటలో యువతీ, యువకుడు చెట్టుకు ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. ప్రాథమిక దర్యాప్తులో ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులు ఛట్టా ఖేడాకు చెందిన అభయ్ కుమార్ (24), మహారామౌకు చెందిన ప్రీతి (20)గా గుర్తించారు. ప్రీతికి 10 నెలల క్రితమే వివాహం జరిగినప్పటికీ, అభయ్‌తో సంబంధాన్ని కొనసాగించినట్లు సమాచారం.