
కంబళదిన్నె ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా నాగేంద్ర
కంబళదిన్నె గ్రామ ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థిగా నాగేంద్ర టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి మాధవీ లతకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గవిగట్టు ఈరన్న, సొసైటీ చైర్మన్ మీ సేవ ఆంజనేయులు, కో ఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ చైర్మన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.







































