
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..ఒకరికి తీవ్ర గాయాలు
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం, గడివేముల మండలంలోని చిందుకూరు, గడిగిరేవుల గ్రామ సమీపంలో ఆదివారం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. వేల్పనూరు గ్రామానికి చెందిన అక్బర్ ఆలీ తన భార్యతో వెళ్తుండగా నంద్యాల నుండి వస్తున్న షేక్ హుస్సేన్ బైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో అక్బర్ ఆలీకి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం 108 ద్వారా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్బర్ ఆలీ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు షేక్ హుస్సేన్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సిసి. నాగార్జున రెడ్డి తెలిపారు.
























