పత్తికొండ - Pattikonda

పత్తికొండ 5వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

పత్తికొండ 5వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

కర్నూలు జిల్లా పత్తికొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని 5వ ఎంపీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఈడిగ గీత నామినేషన్ దాఖలు శుక్రవారం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఎం. శివరుద్ర కుమార్‌కు ఆమె పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఈడిగ గీత మాట్లాడుతూ వార్డు ప్రజల సమస్యల పరిష్కారానికి, పత్తికొండ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలు తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, పల్లె పవన్ కుమార్, ఉప్పర వరలక్ష్మి పాల్గొన్నారు.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా