
JSP సమన్వయకర్త చల్లా శ్రీ వరుణ్‌ను కలిసిన 24 వార్డు అభ్యర్థి
ఎమ్మిగనూరు జనసేన పార్టీ సమన్వయకర్త చల్లా వరుణ్‌ను 24 వార్డు అభ్యర్థి బోయ నాగన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. స్థానిక రాజకీయ పరిణామాలు, వార్డు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా ఇరువురు పరస్పరం అభిప్రాయాలను పంచుకున్నారు.






























