
కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద ఉద్రిక్తత (వీడియో)
TG: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన నేపథ్యంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. అసెంబ్లీ నుంచి ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వమే పోలీసుల సాయంతో కాంగ్రెస్ నేతలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.




