AP: తిరుమల అలిపిరి చెక్పాయింట్ వద్ద నిఘా వర్గాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి. భద్రతా సిబ్బంది నిర్వహించిన సాధారణ స్కానింగ్ తనిఖీల్లో తిరుపతి లీలామహల్ సెంటర్కు చెందిన కె. బాబ్జి అనే వ్యక్తి వద్ద నుంచి 9 'ఓల్డ్ అడ్మిరల్' మద్యం క్వార్టర్ బాటిళ్లతో పాటు నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రానికి మద్యం రవాణా చేయడానికి యత్నించిన నిందితుడిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టారు.