3 నెలలుగా చీకట్లోనే బతుకులు (వీడియో)

5715చూసినవారు
AP: అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం వెదుళ్లువలస ST గదబ PVTG ఆదివాసీ గ్రామం గత 3 నెలలుగా విద్యుత్ దీపాలు లేక చీకటిలో అలమటిస్తోంది. వీధి లైట్లు వెలగకపోవడంతో రాత్రి వేళల్లో విషపురుగుల సంచారం పెరిగిపోయిందని, తమ ప్రాణాలకు భద్రత కరువైందని గ్రామానికి చెందిన మహిళలు, గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం గిరిజనులు కొవ్వొత్తులతో ర్యాలీ, ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.

సంబంధిత పోస్ట్