AP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకు 244 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే, 33,014 కేసులు, 17,652 బైండోవర్ కేసులు నమోదు చేశారు. భద్రతలో భాగంగా 9,217 ఆయుధాలను డిపాజిట్ చేయించామని, ఎనిమిది వందల పద్నాలుగు ఎస్ఎస్ బృందాలు క్షేత్రస్థాయిలో పహరా కాస్తున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.