AP: గుడివాడలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి జోరుగా సాగుతుండగా, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండటం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు ఎన్నికల సమయంలో అత్యంత చురుగ్గా పాల్గొనే ఆయన, ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణుల సమన్వయం వంటి కీలక వ్యవహారాల్లో కనిపించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ఎందుకు ప్రచారానికి దూరంగా ఉంటున్నారనే విషయంపై ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు, కార్యకర్తల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది.