స్థానిక ఎన్నికలు.. సీఎం చంద్రబాబు వార్నింగ్

31చూసినవారు
స్థానిక ఎన్నికలు.. సీఎం చంద్రబాబు వార్నింగ్
ఏపీలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెబల్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేలా చూడాలని ఆయన ప్రజాప్రతినిధులతో జరిగిన టెలికాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కాగా, నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రేపు అంటే మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్