AP: నంద్యాల జిల్లా, పాణ్యం నియోజకవర్గంలో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఓర్వకల్లుకు చెందిన మాజీ సర్పంచు సుబ్బమ్మతో పాటు సుమారు 20 కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. నంద్యాల జిల్లా
టీడీపీ అధ్యక్షురాలు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత సమక్షంలో వీరు పార్టీ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకే వారు పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హనుమన్న, వెంకటేశ్వర్లు, సంజీవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.