AP: మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం ఉ.11.30 గంటలకు అధికారిక షెడ్యూల్,
నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అక్టోబర్ 16-18 వరకు నామినేషన్ల స్వీకరణ, అక్టోబర్ 21 వరకు నామినేషన్ల ఉపసంహరణ, అక్టోబర్ 28న పోలింగ్, అక్టోబర్ 30 కౌటింగ్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నోటిఫికేషన్ వెలువడగానే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తక్షణమే అమల్లోకి రానుంది. రిజర్వేషన్లు, నిబంధనలు, నియోజకవర్గాల పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.