AP: అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలం చేనేత నగర్ సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భవన కార్మికులతో వెళ్తున్న ఐచర్ వాహనాన్ని లారీ ఢీకొనడంతో 12 మంది కార్మికులు గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వారికి చికిత్స అందించారు.