ఎల్లుండి బంగాళాఖాతంలో అల్పపీడనం: APSDMA

9చూసినవారు
AP: దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శుక్రవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆదివారానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం నుంచి మంగళవారం వరకు సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్‌పై దీని ప్రభావం లేదని, రానున్న రోజుల్లో ఇది ఎటు వైపు పయనిస్తుందనే అంశంపై స్పష్టత రానుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్