ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం.. అతిభారీ వర్షాలు

19చూసినవారు
ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం.. అతిభారీ వర్షాలు
AP: ఉత్తర అండమాన్, దానికి ఆనుకుని ఉన్న తూర్పు-మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని APSDMA తెలిపింది. ఇది రేపటికి వాయుగుండంగా, ఎల్లుండి నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఉదయానికి దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలో చేరుకునే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్