
‘ఇరుముడి’ తరువాత రవితేజ సినిమా ఇదే
‘ఇరుముడి’ చిత్రంతో ఘన విజయం సాధించిన రవితేజ, తన 78వ సినిమాను వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయబోతున్నారు. బ్రిడ్స్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. లక్ష్మణ్, శ్రీనిరావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'ఆర్టీ 78' అని పేరు పెట్టారు. అక్టోబరు 11న చిత్ర టైటిల్ను ప్రకటించనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. 'అంటే సుందరానికి', 'సరిపోదా శనివారం' వంటి చిత్రాలతో పేరుగాంచిన వివేక్ ఆత్రేయతో రవితేజ తొలిసారి పనిచేయనుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.




