YCPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు YCPకిరాజీనామా చేశారు. తన కుమార్తె రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో విజయనగరం జడ్పీ ఛైర్మన్గా పనిచేసిన మజ్జి శ్రీను, తన కుమార్తెను అదే స్థానం నుంచి పోటీ చేయించాలని భావించారు. అయితే, బొత్స సత్యనారాయణ తన కుమార్తె అనూషను కూడా అదే స్థానం నుంచి పోటీ చేయించేందుకు సిద్ధం కావడంతో విభేదాలు తలెత్తాయి. దీంతో, మజ్జి శ్రీను టీడీపీలో చేరే అవకాశాలున్నాయి. ఆయన కుమార్తెకు విజయనగరం జడ్పీ సీటుతో పాటు పలు హామీలు లభించినట్లు సమాచారం.