AP: విజయనగరం జిల్లా బొబ్బిలిలోని బెర్రీ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఫర్నేస్ పేలడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఈ పేలుడు ధాటికి కార్మికులు, సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న బొబ్బిలి, సాలూరు, బాడంగి ప్రాంతాల నుంచి ఫైరింజన్లు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.