AP:
ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆదివారం నందిగామలో స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నందిగామ మండలం బెల్లకొండవారి పాలెంకు చెందిన దాదాపు 15 కుటుంబాలు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే సౌమ్య కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని
వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఇప్పటికే ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరినట్లు తెలిసింది.