AP: అన్నమయ్య జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. చిన్నమండెం మండలం మల్లూరు కొత్తపల్లి శ్రీనివాసపురంలో వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీని వీడి 50 కుటుంబాలు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో చేరారు. పార్టీ నాయకులు కొత్తగా వచ్చిన వారిని సాదరంగా ఆహ్వానించి, పసుపు కండువాలు కప్పారు. గ్రామస్థాయిలో కలిసికట్టుగా పనిచేయాలని వారు సూచించారు. తాము పార్టీ నాయకత్వంతో కలిసి భవిష్యత్తులో కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటామని నూతనంగా చేరిన వారు పేర్కొన్నారు.