AP: గుంటూరు జిల్లా, పత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పత్తిపాడు మండలం అనపర్రు గ్రామంలో సుమారు 150 కుటుంబాలు వైఎస్సార్
కాంగ్రెస్ పార్టీని వీడి, ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు సమక్షంలో టీడీపీలో చేరాయి. స్థానిక సంస్థల ఎన్నికల
నోటిఫికేషన్ వెలువడిన అనంతరం, నియోజకవర్గంలో ఇప్పటివరకు మొత్తం 250 కుటుంబాలు టీడీపీలో చేరినట్లు ఎమ్మెల్యే బుర్ల రామాంజనేయులు వెల్లడించారు.