టీడీపీలో భారీగా చేరికలు

39చూసినవారు
టీడీపీలో భారీగా చేరికలు
AP: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని కుంబరి నౌగాం గ్రామానికి చెందిన 70 కుటుంబాలు టీడీపీలో చేరాయి. రామయ్యపుట్టుగలో జరిగిన కార్యక్రమంలో ఇచ్ఛాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ వారిని పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. సీపీఎం నుంచి టీడీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు ఎం.రామారావు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు ఎస్‌వీ రమణ, మాజీ సర్పంచ్‌ పండా, కిషోర్‌ పాడి, ఎం.ఆనంద్‌లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్