AP: తొలి దశలో 100 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన మేయర్లు, ఛైర్పర్సన్లు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉ.11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. అదేరోజు నగరపాలక సంస్థల్లో డిప్యూటీ మేయర్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో వైస్ ఛైర్పర్సన్ల
ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది.