మెగా DSC పెద్ద స్కామ్: జగన్‌

7చూసినవారు
మెగా DSC పెద్ద స్కామ్: జగన్‌
AP: మెగా డీఎస్సీ‌పై మాజీ సీఎం జగన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేసిన వీడియోకు ప్రతిగా జగన్ తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టిన ఈ ఉపాధ్యాయ నియామక ప్రక్రియ అసలైన అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడే పెద్ద కుంభకోణమని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వం చేసిన పొరపాట్లను ప్రశ్నిస్తే, వాటికి సమాధానం చెప్పలేక లోకేష్‌తో పాటు ప్రభుత్వం దొంగ ఏడుపులు ఏడుస్తోందని ఎద్దేవా చేశారు. కనీసం ఎలాంటి అర్హత పరీక్షలు రాయని కొందరికి కూడా అక్రమంగా టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారని జగన్ ఆరోపించారు.

సంబంధిత పోస్ట్