AP: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం జాతీయ రహదారిపై టోల్ప్లాజా వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ.. రహదారిపై నిలిచిన మరో లారీని ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లో రెండు లారీలకు మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్లు, క్లీనర్లు వెంటనే కిందకు దూకడంతో ప్రాణనష్టం తప్పింది. ప్రమాదంలో రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి.