నెల్లూరు పవన్ కల్యాణ్‌కు షాక్ ఇచ్చిన మంత్రి ఆనం

0చూసినవారు
AP: నెల్లూరులో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి షాక్ ఇచ్చారు. ప్రకటించిన అభ్యర్థికి భిన్నంగా, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరో వ్యక్తి పేరును ఖరారు చేస్తూ రాజకీయంగా సంచలనం సృష్టించారు. మంత్రి ఆనం అనుసరిస్తున్న ఈ తీరును నిరసిస్తూ, ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. మంత్రి ఆనం హైడ్రామా కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, నిరసన తెలుపుతున్న జనసేన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్