AP: మాజీ సీఎం జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. నిమ్మగడ్డ వ్యవహారం నుంచి ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల వరకు జగన్ వైఖరిని ప్రశ్నించారు. 2020లో ఎన్నికల సమయంలో జరిగిన హింస, ప్రతిపక్షాలపై దాడులను ప్రస్తావిస్తూ.. గతంలో దాడులు జరిగినప్పుడు స్పందించని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి నీతులు చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. జగన్కు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత ఉందా? అని అచ్చెన్నాయుడు నిలదీశారు.