తన తండ్రి కల అయిన వెలిగొండ ప్రాజెక్టు తమ హయాంలో పూర్తయి, కృష్ణా జలాలు ప్రవహించడం సంతృప్తినిస్తుందని వైఎస్
జగన్ ట్వీట్ చేశారు. దీనిపై మంత్రి నారా
లోకేశ్ స్పందిస్తూ, వెలిగొండ ప్రాజెక్టు ఘనత తమదేనని, 2024లో నీరు కూడా లేని ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించి
జగన్ చరిత్ర సృష్టించారని వ్యంగ్యంగా అన్నారు. నకిలీ ప్రారంభోత్సవాలు వైసీపీకే సాధ్యమని సెటైర్లు వేశారు. మరోవైపు, వెలిగొండ ప్రాజెక్టు ఘనత తమదేనని,
టీడీపీ క్రెడిట్ చోరీ చేస్తుందని
వైసీపీ ఆరోపిస్తోంది.