AP: టోరెంట్ గ్రూప్ ఛైర్మన్ సమీర్ మెహతాతో మంత్రి
లోకేశ్ శుక్రవారం భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సమీర్ మెహతాను మంత్రి
లోకేశ్ కోరారు. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ఏపీని ఎంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని సమీర్ మెహతా తెలిపారు. అలాగే వెల్స్పన్ గ్రూప్ సీఈఓ నితిన్జైన్తో మంత్రి
లోకేశ్ సమావేశమయ్యారు. కాకినాడలో వెల్స్పన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.