మంత్రి లోకేశ్ పాద్రయాత్ర?

51చూసినవారు
మంత్రి లోకేశ్ పాద్రయాత్ర?
AP: 2029 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ, కూటమి ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. మంత్రి నారా లోకేశ్ కూడా త్వరలో పాదయాత్ర ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ పాదయాత్ర చేస్తే, దానికి ప్రతిగా టీడీపీ నుంచి లోకేశ్ కూడా పాదయాత్ర చేసే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన లోకేశ్, జగన్ యాత్రకు కౌంటర్‌గా మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకొస్తారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఇద్దరు నేతలు పోటాపోటీగా పాదయాత్ర చేస్తే రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్