AP: ఈ నెల 4వ తేదీన వేట కోసం సముద్రంలోకి వెళ్లి గల్లంతైన కాకినాడ జిల్లాకు చెందిన మత్స్యకారులు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అందింది. సముద్రంలో చిక్కుకున్న వారి మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అందుబాటులోకి రావడంతో, వారు క్షేమంగా ఉన్నారని గుర్తించారు. గత కొన్ని రోజులుగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ పరిణామం ఊరటనిస్తోంది. ప్రస్తుతం సంబంధిత అధికారులు మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.