బాలిక మిస్సింగ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు

28చూసినవారు
బాలిక మిస్సింగ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
AP: గుంటూరు జిల్లాలో కలకలం రేపిన పదో తరగతి బాలిక అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 10న నమోదైన ఈ కేసులో, బాలిక షేక్ జాన్ సైదాతో కలిసి పారిపోయినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు నుంచి నెల్లూరు, కోయంబత్తూరు, పాలక్కాడ్ మీదుగా సికింద్రాబాద్ వరకు ప్రయాణించినట్లు, నిందితుడు సిమ్ కార్డులు మారుస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసినా, పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో వారి కదలికలను పర్యవేక్షించి పట్టుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్