AP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయనపై
టీడీపీ నేత ఐఎంఎం బాషా శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీకి ఫిర్యాదు చేశారు. ముస్లిం మైనార్టీలకు ఇంటి పట్టాలు ఇప్పిస్తానని నమ్మించి దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారని బాషా ఆరోపించారు. అనంతపురం కలెక్టరేట్లో జరిగిన ఈ ఘటనలో, ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఐఎంఎం బాషాను పోలీసులు అడ్డుకుని, అక్కడి నుంచి తరలించారు. ఈ సంఘటన శాసనసభ మైనార్టీ సంక్షేమ కమిటీ ఛైర్మన్ మహమ్మద్ నాసీర్ అహ్మద్ సమక్షంలో జరిగింది.