ఏపీలోని ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి పంచాయతీ ఎన్నికల్లో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సోదరుడు గంటా
చిరంజీవి సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి,
టీడీపీ రెబల్ అభ్యర్థి చాగంటి వెంకట రమణమ్మపై 319 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అలాగే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం పాత ఇంజరం సర్పంచ్‌గా
టీడీపీ మద్దతుతో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద సతీమణి చెల్లి శేషకుమారి విజయం సాధించారు. గతంలో ఆమెకు సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది.