AP: రానున్న 3 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, విజయనగరం, భీమిలి, ఎస్.కోట, జామి, కొత్తవలస, వేపాడ, అనకాపల్లి ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.