AP: కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు 50 శాతం పెరుగుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఎంపీ సీట్లు 25 నుంచి 38కి పెరుగుతాయి. కేంద్ర నిర్ణయం పాటించడం రాష్ట్రాలకు శాపం కాకూడదని చెప్పాం. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దని కేంద్రాన్ని కోరాం. అన్నీ ఆలోచించి ప్రధాని
మోదీ లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అన్నారు.