601 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి: SEC

49చూసినవారు
601 మండలాల్లో ఎంపీపీ ఎన్నికలు పూర్తి: SEC
AP: రాష్ట్రవ్యాప్తంగా 659 మండల ప్రజాపరిషత్‌లకు 601 చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు విజయవంతంగా పూర్తయినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. మిగిలిన 58 మండల ప్రజాపరిషత్‌లలో ఎన్నికలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, వాటికి శుక్రవారం ఉదయం 11 గంటలకు ఎన్నికలు జరుగుతాయని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. మన్యం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.

సంబంధిత పోస్ట్