MPP, ZP అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల

24చూసినవారు
MPP, ZP అధ్యక్షుల ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీపీలు, జడ్పీ అధ్యక్షుల పరోక్ష ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 19న 659 మండల పరిషత్‌లలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులకు, 20న 28 జిల్లా పరిషత్‌లలో ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌ పదవులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అంతకుముందు ఎంపీపీల్లో ఒక్కొక్కరు, జడ్పీల్లో ఇద్దరు చొప్పున కో-ఆప్షన్‌ సభ్యులను ఎన్నుకోనున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్