AP: రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్
ఎన్నికలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. బుధవారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో స్థానిక పరిస్థితులపై ఎస్ఈసీ ఆరా తీయగా, వర్షాలు తగ్గుముఖం పట్టాయని కలెక్టర్లు నివేదించారు. కొన్ని చోట్ల మినహా పోలింగ్ నిర్వహణకు ఎటువంటి ఇబ్బందులు లేనందున, ఎన్నికలను ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది.