AP: కృష్ణా జిల్లా తాడిగడప మున్సిపాలిటీ వద్ద ఎన్నికల హడావుడి నెలకొంది. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద విధులు నిర్వహించడానికి వచ్చిన సుశీల అనే మహిళ ఒకసారిగా స్పృహ తప్పి కింద పడిపోయారు. అనారోగ్య సమస్యల వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుందని వైద్య సిబ్బంది తెలిపారు. వైద్య
పరీక్షలు నిమిత్తం ఆమెను 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించారు.