ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు.. మద్యం దుకాణాలు బంద్‌

69చూసినవారు
ఏపీలో మున్సిపల్‌ ఎన్నికలు.. మద్యం దుకాణాలు బంద్‌
ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీఓ ఆర్‌టీ నంబర్‌ 1286 ప్రకారం 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. అక్టోబర్‌ 28న పోలింగ్‌ జరగనున్నందున, పోలింగ్‌ ముగిసే సమయానికి 48 గంటల ముందునుంచే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఓట్ల లెక్కింపు రోజున కూడా మద్యం దుకాణాలు బంద్‌ కానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్