మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా: ఎస్‌ఈసీ

47చూసినవారు
మైదుకూరులో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా: ఎస్‌ఈసీ
AP: వైఎస్సార్‌ కడప జిల్లాలోని మైదుకూరులో జరగాల్సిన మున్సిపల్‌ ఎన్నికలను ఎస్‌ఈసీ అనిల్‌చంద్ర పునేఠా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నామినేషన్‌ పత్రాలను చించివేయడం వల్ల పరిశీలన సాధ్యం కాలేదని జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ మున్సిపాలిటీకి త్వరలో మళ్లీ కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్